వాల్మీకి మహర్షి బోధనలు ఆదర్శనీయం
జిల్లా అదనపు ఎస్పీ నరసింహారెడ్డి
కామారెడ్డి, సెప్టెంబర్ 7 (విజయ క్రాంతి): మారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ కె. నరసింహ రెడ్డి వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.జిల్లా అదనపు ఎస్పీ నరసింహారెడ్డి మాట్లాడుతూ....మహర్షి వాల్మీకి మన దేశానికి ఆదర్శప్రాయమైన మహానుభావుడు, కవిశ్రేష్ఠుడు, ఆధ్యాత్మిక ప్రబోధకుడు.
ఆయన సత్యం, ధర్మం, న్యాయం, కర్తవ్యనిష్ఠ వంటి విలువలను రామాయణంలో రచించి సమాజానికి అందించారు.వాల్మీకి బోధనలు మనకు నీతి, సమానత్వం, సత్యనిష్ఠ జీవనానికి మార్గదర్శకాలు. ఆయన చూపిన ఆచరణాత్మక మార్గంలో నడవడం, ఆయన ఆశయాలను కొనసాగించడం ద్వారానే మహర్షి వాల్మీకి గారికి మనం నిజమైన గౌరవం నివాళి అర్పించి నట్లవుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఓ ఏవో కె. లింగ నాయక్ గారు, రిజర్వు ఇన్స్పెక్టర్లు సంతోష్ కుమార్, నవీన్, కృష్ణ డిపిఓ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మద్నూర్‌లో..
మద్నూర్, అక్టోబర్ 7 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవం మంగళవారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి ఆలయంలో వేదమంత్రోచ్చరణలతో అభిషేకం పూజలు, హరతీ మహోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు. వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కల్లుర్ అశోక్, యాజంప్ సాయిలు, నాందేవ్ మేస్త్రీ, యాదు మేస్త్రీ, రాహుల్, తులసి రాం, రాజు, సాహెబ్ రావ్, సాయిలు, లక్ష్మణ్, దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు.




