15 May, 2026 | 2:49 PM

Breaking News

సత్తుపల్లిలో నల్లమోతు శ్రీనివాస రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి తుమ్మల   •   తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు   •   Fuel Price Hike: ‘మోదీ తప్పుకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు’: కేంద్రంపై రాహుల్ విమర్శలు   •   ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం   •   ఐదు దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ   •   చెరువులు వాగుల వద్ద జాగ్రత్తగా ఉండండి   •   నేరాల నియంత్రణకు అందరూ సహకరించాలి: సీఐ ధనుంజయ్ గౌడ్   •   ఇక OMR పత్రాలు ఉండవు: ఆన్‌లైన్‌లోనే NEET పరీక్ష   •   నేరడిగొండ, బజార్హత్నూర్ మండలాల్లో జొన్నల కొనుగోలు ప్రారంభం   •   గన్ని బ్యాగుల కొరత.. పంట తరలింపులో జాప్యం రోడ్డెక్కిన అన్నదాత   •  

సొనాల బంద్ సంపూర్ణం

31-10-2025 01:20 AM

బోథ్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): రైతులను అరెస్టు చేసినందుకు నిరసనగా గురువా రం చేపట్టిన సొనాల బంద్ సంపూర్ణంగా జరిగింది. ఉదయం నుండే వ్యాపార వాణిజ్య సముదాయాలను యజమానులు మూసేసి స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. సొనాల లో పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు ధర్నా చేయగా 13 మంది రైతులను అరెస్టు చేసిన విషయం విధితమే. దీనికి నిరసనగా బంద్ చేపట్టారు. కాగా ఈ బంద్ కు  బీఆర్‌ఎస్ నాయకులు పూర్తి మద్దతు పలికి రైతులకు అండగా నిలిచారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ మాట్లా డుతూ... సోనాల బంద్  పిలుపు ఇవ్వగానే సంపూర్ణ బంద్ పాటించిన వ్యాపార యజమానులకు, ఆటో కార్మికులకు, కృతజ్ఞతలు తెలిపా రు. ఇది రైతుల విజయమని పేర్కొన్నారు. బోథ్, సోనాల రైతులకు, యజమానులకు ఎటువంటి  సమస్య వచ్చినా మీ వెంటే  ఉంటామని ఎవరు అధర్య  పడద్దని, ఈ బంద్  వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించాలన్నారు.

రైతులకు అండగా నిలిచిన బిఆర్‌ఎస్  నాయకులపై, రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టడం హేమమైన చర్యని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంకు రైతులపై  ప్రేమ ఉంటే సోనాల మండల కేంద్రంలో  వెంటనే సోయా, మక్కల కొనుగోలు ప్రారంభించాలని, రైతులపై ఉన్న  కేసులను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, రైతుల పాల్గొన్నారు.