calender_icon.png 10 February, 2026 | 7:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏయూలో ముగిసిన స్మార్ట్ పవర్థాన్

10-02-2026 12:02:55 AM

ఘట్ కేసర్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి) : అనురాగ్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఐఈఈఈ-పిఈఎస్, ఆర్‌ఈఐ క్లబ్, ఈవి క్లబ్ సహకారంతో నిర్వహించిన స్మార్ట్ పవర్థన్2026 హ్యాకథాన్ కార్యక్రమం సోమవారం విజయవంతంగా ముగిసింది.30 గంటల పాటు నిరవధికంగా సాగిన ఈ హ్యాకథాన్లో విద్యార్థులు అత్యంత ఉత్సాహంతో పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు.

దేశంలోని వివిధ కళాశాలల నుండి పాల్గొన్న జట్లు క్రింది ప్రధాన అంశాలపై తమ వినూత్న ప్రాజెక్టులను సమర్పించాయి. స్మార్ట్, ఇంటెలిజెంట్ గ్రిడ్ టెక్నాలజీస్ మోడల్ ఆధారిత సస్టైనబుల్ సిస్టమ్స్ ఎలక్ట్రిక్, స్మార్ట్ మొబిలిటీ పర్యావరణం, వ్యవసాయం, నీటి నిర్వహణ , ఆహార భద్రత సస్టైనబుల్ స్మార్ట్ సిటీస్ స్మార్ట్ హెల్త్ కేర్, డిజిటల్ ఫార్మా ఎకో సిస్టమ్ ఈకార్యక్రమానికి కన్వీనర్గా హెచ్‌ఓడి ఈఈఈ డాక్టర్ టి. అనిల్ కుమార్  వ్యవహరించగా, కో-కన్వీనర్లుగా డాక్టర్ డి. కృష్ణ, డాక్టర్ టి. అభిరామ్ బాధ్యతలు నిర్వహించారు.

ఫ్యాకల్టీ కో-ఆర్డినేటర్లుగా ఆర్. మురళి, డి. రమేష్, ఆర్. రేఖ సేవలందించారు. విద్యార్థి సమన్వయకర్తలుగా ఉప్పారి గణేష్, చి. శ్రవణ్, బాలమురి లక్షిత, రమంచ హర్షిణి చురుకుగా వ్యవహరించి కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. హ్యాకథాన్ ముగింపు కార్యక్రమంలో విజేత జట్లకు నగదు బహుమతులు మరియు సర్టిఫికెట్లు ప్రదానం చేయబడింది.