10 May, 2026 | 6:59 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

అయ్యప్పస్వామి దేవాలయం నిర్మించిన సాయిరి పద్మా మహేందర్ దంపతుల సేవలు అభినందనీయం

18-11-2025 12:00 AM

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు 

సుల్తానాబాద్ నవంబర్ 17 (విజయ క్రాంతి):అన్నదాన శిబిరం ను అయ్యప్ప స్వామి ఆలయంగా నిర్మించిన సాయిరి పద్మ మహేందర్ దంపతుల సేవలు అభినందనీయమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు, సోమవారం అయ్యప్ప స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కరపత్రాన్ని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 15 ఏళ్ల నుండి సాయిరి పద్మ మహేందర్ దంపతులు దాతల సహకారంతో ఎంతో శ్రమించి అయ్యప్ప స్వాములకు అన్నదాన శిబిరం ఏర్పాటు చేసి... ఇప్పుడు అదే శిబిరం ను ఏడు నెలల్లో శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం చేయటం అభినందనీయమని పద్మ మహేందర్ దంపతులను అభినందించారు, ఈ ఘనత వారికే దక్కుతుందన్నారు, ఈనెల 26న జరుగు అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపనలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సాయిరి మహేందర్ కోరారు.

ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దేవాలయం ట్రస్ట్ వ్యవస్థాపకులు, చైర్మన్ సాయిరీ మహేందర్ , ట్రస్టు గౌరవ అధ్యక్షులు మిట్టపల్లి మురళీధర్ , యంత్ర ప్రతిష్టాపకులు, ఆధర్వణ వేద పండితులు ఉప్పర మల్యాల లక్ష్మణ్ శర్మ , ఆలయ పురోహితులు, గూడ రమేష్ శర్మ , రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రెటరీ జైపాల్ రెడ్డి , ఆలయ చీఫ్ అడ్వైజర్ కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న), ముత్యాల రవీందర్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వామి భక్తులు, కాంగ్రెస్ నాయకులు , భక్త బృందం పాల్గొన్నారు.