అసిస్టెంట్ డైరెక్టర్ నాగేశ్వరరావు సేవలు వెలకట్టలేనివి
- టీఎస్‌పీఏ డైరెక్టర్ అభిలాష బిస్ట్
- ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికినన పోలీసు అధికారులు
రాజేంద్ర నగర్ జూలై 1 (విజయ క్రాంతి) : తెలంగాణ పోలీస్ అకాడమీలో అసిస్టెంట్ డైరెక్టర్గా 35 ఏళ్ల పాటు విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన నాగేశ్వరరావు సేవలు వేల కట్టలేనివి అని టీ ఎస్ పి ఎ డైరెక్టర్ అభిలాష బిస్ట్ అన్నారు బుధవారం అకాడమీలోని ఇంటర్నేషనల్ ఆఫీసర్స్ మెస్లో నాగేశ్వర్ రావు కు ఘనంగా సన్మానించారు . అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్, ముఖ్య అతిథిగా హాజరై నాగేశ్వరరావును శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ అభిలాష్ బిస్త్ మాట్లాడుతూ, 1991లో పోలీస్ శాఖలో చేరిన నాగేశ్వరరావు నక్సలిజం తీవ్రంగా ఉన్న కాలంలో క్లిష్ట పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటూ ప్రజలకు విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, కె.ఆర్.కె. ప్రసాద్, శ్రీరామమూర్తి, అసిస్టెంట్ డైరెక్టర్లు నరహరి, వేమా శ్రీనివాసరెడ్డి, వేముల శ్రీనివాసరావు, డీఎస్పీ ఆదూరి శ్రీనివాసరావు తదితరులు నాగేశ్వరరావు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు బ్యాచ్మేట్లు వెంకట్రావు, ప్రతాప్, రాంకుమార్, జ్ఞానేంద్రరెడ్డి, సతీష్ కుమార్, అకాడమీ డీఎస్పీలు, ఫ్యాకల్టీ సభ్యులు, అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొని ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.






