రేపు రెండో విడత రైతు భరోసా
నిధుల విడుదల చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు
హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా రెండో విడత నిధుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సోమవారం రెండో విడుత నిధు లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశిం చారు. ఈ పథకం కింద ప్రభుత్వం రాష్ట్రంలో 1.50కోట్ల ఎకరాలకు పెట్టుబడి సా యం అందిస్తున్నది. ఎకరానికి రూ.6 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో నిధు లు జమచేస్తున్నది.
సోమవారం భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల సమక్షంలో ఈ నిధులు విడుదల చేస్తారు. తెలంగాణలో మొత్తం 73 లక్షల మంది రైతులున్నారు. వీరందరికీ గత నెల 23న మొదటి విడుత రైతు భరోసాను ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రతి రైతుకు ఒక ఎకరానికి సరిపడే పెట్టుబడి సాయం విడుదలచేసింది.
దాదాపు రూ.3,590 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసింది. రెండో విడుతలో 45,11,947 మంది రైతులు భరోసా సాయం అందుకోనున్నారు. దీంతో రూ.5,653 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. రెండో విడత నిధుల పంపిణీ అనంతరం, మూడో విడత నిధులను వీలైనంత తొందరగా విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తున్నది.






