పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోనీ గ్రామాల్లో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్థానిక కాంగ్రెస్ నాయకులతో అధికారులతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.మండలంలోని మాసంపల్లి గ్రామంలో 30 లక్షల వ్యాయముతో నిర్మించనున్న ఫుడ్ గ్రేస్ స్టోరేజ్ గోదాం నిర్మాణానికి భూమి పూజ చేశారు. మెల్ల కుంట తండా గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తాండూర్ కిచ్చన్నపేట ఆధ్వర్యంలో నిర్మించిన గోదాం, షెడ్డు ప్రారంభోత్సవం చేపట్టారు. నాగిరెడ్డిపేట గ్రామంలో 42 లక్షల వ్యాయముతో పటేల్ చెరువు పునరుద్ధీకరణ పనులకు భూమి పూజ చేపట్టారు.
పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువ పునరుద్ధీకరణ పనులు 40 లక్షల వ్యాయముతో కొనసాగుతుండడంతో అట్టి పనులను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పరిశీలించారు. అలాగే పెద్ద ఆత్మకూరు గ్రామంలో పర్యటించి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై నూతనంగా చేపట్టబోయే అభివృద్ధి పనులపై ఆరాధిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ... మాల్తుమ్మెద గ్రామానికి 20000 మెట్రిక్ టన్నుల గోదాంను తీసుకురావడం జరిగిందన్నారు. నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో ఎమ్మార్వో ఆఫీస్ శిథిల వ్యవస్థలో కొత్త ఎమ్మార్వో ఆఫీస్ నిమిత్తం కొరకు రెండు కోట్ల 75 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందన్నారు.
అంతేకాకుండా ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం,సన్న బియ్యం తదితర అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్న అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు పెద్దపట్లలో సునంద కిషన్ రెడ్డి,మన్నే వెంకట్,బాల్య నాయక్, ఉమ్మన్నగారి లక్ష్మి, సంజీవరావు,ఎమ్మార్వో బిక్షపతి,ఎంపీడీవో గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్,తాండూర్ సొసైటీ చైర్మన్ ఆకిడి గంగారెడ్డి,నాయకులు సంజీవులు, దివిటి కిష్టయ్య, మీదే బాబురావు,గులాబ్ హుస్సేన్,వస్రం నాయక్, వరిగే విట్టల్, శ్రీరామ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.






