సీతారాముల పవిత్ర బంధం ఆదర్శనీయం
మున్సిపల్ చెర్మన్ డి.శ్రీనివాస్, వైస్ చెర్మన్ తన్నీరు మల్లిఖార్జున్
హుజూర్ నగర్, మార్చి 27: లోక కల్యాణం కోసం ఎన్నో త్యాగాలు చేసిన సీతారాముల పవిత్ర బంధం నేటి తరానికి ఆదర్శనీయమని హుజూర్ నగర్ మున్సిపల్ చెర్మన్ దొంతగాని శ్రీనివాస్,వైస్ చెర్మన్ తన్నీరు మల్లిఖార్జున్ రావు అన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా పట్టణంలోని పలు వార్డులలో ముఖ్య అతిథులుగా పాల్గొని సీతారామచంద్రులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రజలంతా శ్రీరామనవమిని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.నవమి రోజున ప్రతి ఏటా వైభవోపేతంగా శ్రీ సీతా రాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటారన్నారు. సామాజిక న్యాయం, ధర్మాన్ని ఆశ్రయించే పాలన ఎలా ఉండాలనే దానికి శ్రీరాముడు చూపించిన మార్గమే నిదర్శనమని గుర్తు చేస్తూ అందుకు అనుగుణంగా రాష్ట్రాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
రాముని ధర్మాన్ని అనుసరిస్తూ అందరూ సుఖంగా ఉండాలని ఆకాంక్షించారు.సీతారాముల కరుణాకటాక్షాలు ప్రజలపై ఉండాలని, పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా వెలుగొందేలా, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని దేవతా మూర్తులను ప్రార్థించారు.ఈ మున్సిపల్ కౌన్సిలర్లు,ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డి,సులువనాగలక్ష్మి చందు,వల్లపుదాసు కృష్ణ, పులిచింతల వెంకటరెడ్డి,నల్లగొండ సుజాత చంటి,దగ్గుపాటి కవిత బాబురావు,చిట్టీపోతుల భద్రమ్మ, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు బొడ్డు గోవిందరావు, తదితరులు,పాల్గొన్నారు.




