25 August, 2026 | 11:23 AM

మొరం పోశారు.. బురదమయంగా మార్చారు..!

25-08-2026 10:34 AM

బోథ్ ఆగస్టు25(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పాత కోర్టు రోడ్డు పైన రెండు రోజుల క్రితం గ్రామపంచాయతీ వారు మొరం పోశారు. దీంతో వర్షానికి రోడ్డంతా బురదమయంగామారింది. దీంతో ఈ రూట్లో ప్రయాణించే ద్విచక్ర వాహనాల వారితో పాటు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు. ఈ రోడ్డుపై నుండి వెళ్లే పాఠశాల కళాశాల విద్యార్థులతో పాటు వివిధ పనులపై ప్రభుత్వ కార్యాలయానికి వచ్చేవారు స్వతమతమవుతున్నారు. అధికారులు బురదమయంగా మారిన రోడ్డు వల్ల పడుతున్న ఇబ్బందులను తొలగించాల్సిన అవసరం ఉంది. రోడ్డు గుంతగా మారింది. దీంతో మొరం వేసి నింపడంతో రోడ్డు తీరే మారిపోయింది.