ఊపిరి పోసిన వర్షం
18-07-2026 02:08 AM
ఉమ్మడి జిల్లాలో రైతన్నల హర్షం
కామారెడ్డి, జూలై 17 (విజయక్రాంతి): గత 15 రోజులుగా వర్షాల జాడ లేకపోవడంతో రంది పడ్డ ఉమ్మడి జిల్లా రైతన్నలకు శుక్రవారం కురిసిన వర్షం ఎంతో ఊరట కలిగించింది. మెట్ట భూముల్లో వేసిన పంటలు వాడిపోయే దశలో చేరుకోవడంతో ఆందోళన చెందిన రైతన్నలకు ఈ వర్షం ఎంతో ఊరట నిచ్చింది. వానకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచిన ఆశించిన స్థాయిలో వర్షాలు కురువకపోవడంతో ఆందోళన చెందిన రైతులకు ఈ వర్షం ఎంతో ఊరట నిచ్చింది.






