22 May, 2026 | 11:44 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, ప్రక్రియను సజావుగా నిర్వహించాలి

27-11-2025 07:45 PM

అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్య నాయక్ 

వనపర్తి (విజయక్రాంతి): జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి దశ నామినేషన్ స్వీకరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్య నాయక్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం నాడు గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి దశలో భాగంగా ఘనపూర్ (Ghanpur) మండల పరిధిలోని సోలిపూర్, ఉప్పరపల్లి, మాణజిపేట, షాపూర్, ఘనపూర్, మామిడిమాడ, అప్పారెడ్డిపల్లి, ఆల్మైపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

నామినేషన్ స్వీకరణ ప్రక్రియ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో ఓటరు జాబితాను తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల్లో ఫారం 1 ప్రచురణ చేశారా లేదా అని తనిఖీ చేశారు.​నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు ఒక ప్రపోజల్ మరియు మరొక వ్యక్తి – మొత్తం ముగ్గురిని మాత్రమే రిటర్నింగ్ అధికారి గదిలోకి అనుమతించాలన్నారు. ​ఎన్నికల నిబంధనలను పక్కాగా అమలు చేస్తూ, పారదర్శకతతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారులకు ఆయన తగిన సూచనలు చేశారు.