10 April, 2026 | 3:22 PM

Breaking News

ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •  

నిరుద్యోగ సమస్యను తక్షణమే పరిష్కరించాలి

10-04-2026 12:25 AM

పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్శక రవి డిమాండ్ 

గుండాల, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని, ప్రతి సంవత్సరం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమయిందని ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి దర్శక రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురువారం మండల కేంద్రంలో జరిగిన పీవైఎల్ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు నాలుగు వేలు కల్పిస్తామని, రుణాలు ఇస్తామని దరఖాస్తులు తీసుకొని నేటి వరకు ఇవ్వలేక పోయారని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి జాబ్ క్యాలండర్ ప్రకటిస్తామని ఇప్పటివరకు ప్రకటించక లేకపోయారని దుయ్యబట్టారు.

ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను గుర్తించి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  మండల అధ్యక్ష, కార్యదర్శులు తాటి రమేష్, కల్తి ప్రమోద్, మండల నాయకులు మోకాళ్ళ పోతయ్య, అరెం రామారావు, ఈసం సుధాకర్, ఇసం రమేష్, కల్తి ప్రభాకర్  పాల్గొన్నారు.