వెయ్యి సంవత్సరాల జ్యోతిర్లింగ దర్శనం పూర్వజన్మ ఫలం
మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ
సూర్యాపేట, మార్చి 26 విజయక్రాంతి): వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన సోమనాథ్ మూల విరాట్ జ్యోతిర్లింగ దివ్య దర్శనం పూర్వ జన్మ పుణ్యఫలమని సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రవి మహల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోమనాథ్ మూల విరాట్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు.
భారతదేశంలోని జ్యోతిర్లింగాల్లో మొదటిదైన వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన సోమనాధ్ జ్యోతిర్లింగ ఆలయాన్ని గజని మహ్మద్ ధ్వంసం చేసిన తరువాత అందులోని మూల విరాట్ జ్యోతిర్లింగాన్ని అగ్ని హోత్రి బ్రాహ్మణులు గోప్యంగా దాచి నేటి వరకు పూజలు నిర్వహిస్తున్నారని అన్నారు. వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన సోమనాథ్ మూల విరాట్ జ్యోతిర్లింగం నేటి వరకు మన కళ్ళకు అందనిదని అలాంటిది మన దర్శనంకు మన పట్టణంకు రావడం ప్రజలందరి అదృష్టమన్నారు. అలాంటి జ్యోతిర్లింగాలను సూర్యాపేట పట్టణ ప్రజలకు దర్శన భాగ్యం కల్పించిన బ్రహ్మర్షి రిషి దేవ వ్రత్ జి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చలమల్ల నరసింహ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు వంగవీటి రమేష్, బుద్ధ బిక్షపతి, మేకల సందీప్, బాణాల శ్రీనివాస్ రాధాకృష్ణ భరద్వాజ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.




