పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలి
- సీపీఐ నాయకుల డిమాండ్
- పలు ప్రాంతాల్లో ఆందోళనలు
హనుమకొండ/సూర్యాపేట/పాల్వంచ/ముకరంపుర, మే 16 (విజయక్రాంతి): పెట్రో ల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డి మాండ్ చేస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సీపీఐ నాయకులు ఆందోళనలు చేశారు. ప్రజలపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆర్థిక భారం మోపిందని, కేంద్ర సర్కార్ వైఫల్యంతోనే దేశంలో ధరల పెరుగుదల అని మండిపడ్డారు. హనుమకొండ నగరంలోని డబ్బాలు జంక్షన్ వద్ద సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
తోట భి క్షపతి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం రోజురోజుకు ధరలను పెంచి పేద ప్రజలపై అధిక భారం మోపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశా రు. పెట్రోల్, డీజీల్, గ్యాస్ సిలెండర్ ధరల వలన నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్భణం పెరిగి ప్రజలపై ఆర్థిక భారాలు పడతాయన్నారు. పాల్వంచలో సీపీఐ పట్ట ణ, మండల కార్యదర్శులు అడుసుమిల్లి సా యిబాబా, వీసంశెట్టి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ సామాన్య ప్రజలపై భారాన్ని మోపుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ప్రతి ఎన్నికల సందర్భంగా మేము పెట్రోల్, డీజిల్ పై ఎటువంటి ధరలు పెంచమని అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మిస్తూ ఎన్నికలు అయిపోయిన వెంటనే నిస్సిగ్గుగా రేట్లు పెంచుతూ దేశ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
సీపీఐ కరీంనగర్ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ కమాన్ చౌరస్తా వద్ద కేం ద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో వాణిజ్య భవన్ వద్ద ఆటోకు తాడు కట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో ఇక్కడ కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచామంటున్న బీజేపీ ప్రభుత్వం అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు ఎందుకు ధరలు తగ్గించలేదన్నారు.






