17 May, 2026 | 2:37 AM

సైబర్ మోసాల ముఠా అరెస్ట్

17-05-2026 01:02 AM
  1. మాల్వేర్ ఫోన్లతో రూ.77.75 లక్షల మోసం 
  2. రూ.15 లక్షల నగదు, 1 ల్యాప్‌టాప్, 11 సెల్‌ఫోన్లు స్వాధీనం

శేరిలింగంపల్లి, మే 16 (విజయక్రాంతి): ఈ-సిమ్ నుంచి ఫిజికల్ సిమ్‌కు మార్చాలని నమ్మించి మాల్వేర్ ఇన్‌స్టాల్ చేసిన మొబైల్ ఫోన్లను కొరియర్‌లో పంపి బ్యాంక్ ఖాతాల నుంచి రూ.77.75 లక్షలు కాజేసిన అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ టీ సాయిమనోహర్ శనివారం మీడియాకు వెల్లడించారు.

నిందితులు సలీం మొండల్, అబ్దుల్ అలీమ్ ఎస్కే అలియాస్ మిట్టు, సయ్యద్ హషీమ్ రెజా అలియాస్ టిప్పు, మిజానుర్ రెహమాన్ షేక్, బన్సీధర్, మెహబూబ్ ఆలం అన్సారీ అలియాస్ సూరజ్‌లు సిటీబ్యాంక్ ప్రెస్టీజ్ క్రెడిట్ కార్డ్ డివిజన్ అధికారులమని చెప్పి బాధితులకు ఫోన్లు చేశారు. వెరిఫికేషన్ పేరుతో సిమ్ మార్చాలని ఆ సమాచారాన్ని సేకరించి మోసాలకు తెరతీశారు.

రూ.77,75,451 కాజేశారు. ఫిర్యాదు అందుకున్న సీసీఎస్ బృందం సాంకేతిక ఆధారాలు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, కొరియర్ ట్రాకింగ్ వివరాల ఆధారంగా నిందితులను గుర్తించింది. ట్రాన్సిట్ వారెంట్లపై పశ్చిమ బెంగాల్ వెళ్లిన ప్రత్యేక బృం దం ఉత్తర 24 పరగణాల జిల్లా బసిర్హాట్, బాదురియా ప్రాంతాల్లో దాడులు నిర్వహిం చి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుంది.

నిందితుల నుంచి మొత్తం రూ.15 లక్షల నగదును రికవరీ చేశారు. నిం దితులను న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలు, సిమ్ సంబం ధిత సమాచారాన్ని గుర్తు తెలియని వ్యక్తులకు చెప్పవద్దని, ఆర్డర్ చేయని కొరియర్ పరికరాల్లో సిమ్ కార్డులు పెట్టవద్దని డీసీపీ సాయిమనోహర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.