13 August, 2026 | 1:57 AM

పీఆర్‌సీ వెంటనే అమలు చేయాలి

13-08-2026 12:40 AM

పెండింగ్‌లో ఉన్న 6 విడతల కరువు భత్యాన్ని చెల్లించాలి

హెల్త్ కార్డులను అమలు చేయాలి

మెదక్, ఆగస్టు 12 (విజయక్రాంతి): ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో దశల వారి పోరాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మెదక్ మండల తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరామ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పిఆర్సి నివేదికను తెప్పించుకొని 51శాతం ఫిట్మెంట్ తో కూడిన వేతన సవరణను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఆరు విడుతల కరువు కరువు బత్యాన్ని వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగ ఉపాధ్యాయుల నుండి గత మూడు నెలలుగా వేతనంలో నుంచి  చికిత్సల కొరకు 1.5% శాతం మినహాయింపులు జరుపుతున్నప్పటికీ నేటికీ ఏ ఆసుపత్రి కూడా ఉచిత వైద్యం అందించడం లేదని వాపోయారు.

ప్రభుత్వం తమ కార్యక్రమాలలో ఆరంభశూరత్వం తప్ప అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వారు ఆరోపించారు. ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీకి హామీ ఇచ్చిన మేరకు ఆగస్టు 15 నాడైనా పిఆర్సి నివేదికను చెప్పించుకుని అమలు చేయాలని పెండింగ్లో ఉన్నటువంటి విడుదల చేయాలని గతంలో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ ను రద్దుచేసి ఓపిఎఎస్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని తెలంగాణలో కూడా వెంటనే 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం ప్రజల్లో భాగమైనటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయుల శ్రేయస్సు పట్ల నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని కోరారు. ప్రభుత్వ  విద్యకు గొడ్డలి పెట్టగా మారిన జి ఓ 25 ను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి రాష్ట్ర కౌన్సిలర్ సంగీత మెదక్ మండల అధ్యక్షుడు నాగరాజు టీఎస్ యుటిఎఫ్ మెదక్ మండల ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్ , జిల్లా కార్యదర్శి పోచయ్య పాల్గొన్నారు.