12 August, 2026 | 3:02 AM

రైతుల పక్షపాతిగా ప్రజాపాలన ప్రభుత్వం

12-08-2026 12:09 AM

ఖానాపూర్, ఆగస్టు 11 ( విజయక్రాంతి):రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజాపాల ప్రభుత్వం రైతుల పక్షపాతిగా నిలుస్తూ అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమా బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం పెంబి మండలం పోచంపల్లి గ్రామంలో 30 లక్షలతో వ్యవసాయ గోదాము నిర్మాణానికి భూమి పూజ ఖానాపూర్ ఎమ్మెల్యే భూమి పూ జ చేసి పనులు ప్రారంభించారు. రైతుల కోసం తమ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేసిందని పెట్టుబడి సాయం ఎకరానికి 6000 సహాయం అందిస్తుందన్నారు.

రైతు బీమా పంపిణీ చేస్తున్నామన్నారు.గ,పోచంపల్లి  అంకేన చుట్టూ పక్కల గ్రామాలకు ఎదురవుతున్న రోడ్డు సమస్యను అన్ని గ్రామాల ప్రజల ఐక్యతతోనే సాధ్యం అని,వారం రోజుల లోపల బ్రిడ్జి నిర్మాణానికి 20 లక్ష్యాలతో ప్రొసీడింగ్స్ ఇస్తాం అని హామీ ఇచ్చారు,అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం అన్నారు.

సెల్ టవర్ ఏర్పాటుకు కృషి చేస్తాం అని అధికారుల ద్వారా నివేదికలు తీసుకొని చుట్టు పక్కల గ్రామాలకు నెట్వర్క్ వచ్చేలా సెంటర్ పాయింట్ లో ఏర్పాటు చే స్తాం అని,అవసరమైన ల్యాండ్ గ్రామస్తులు,అధికారులతో కలిసి సేకరించాలని సూచించారు. గ్రామస్తులు ఎమ్మెల్యే గారిని శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో పెంబి మండల వివి ధ శాఖల అధికారులు,గ్రామ సర్పంచ్,ప్రజలు,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.