12 August, 2026 | 8:53 AM

ఓటర్ల జాబితాలో ‘గల్లంతు’ లెక్కలు!

12-08-2026 12:07 AM
  1. ఎస్‌ఐఆర్లో 48,160 ఫారాలు అన్కలెక్టబుల్
  2. 23,803 మంది ఆచూకీ లేదు
  3. 11,317 మంది మృతి చెందినవారిగా గుర్తింపు
  4. 89.43 శాతం ఫారాల డిజిటైజేషన్ పూర్తి

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 1౧(విజయ క్రాంతి): జిల్లాలో ఓటర్ల జాబితా ప్రక్షాళనలో చేపట్టిన ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్)లో విస్తుపోయే గ ణాంకాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలోని సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో మొత్తం 4,55,596 మంది ఓటర్లకు ఫారా లు పంపిణీ చేయగా, ఇప్పటివరకు 4,07, 436 ఫారాల డిజిటైజేషన్ పూర్తయింది. దీంతో జిల్లాలో డిజిటైజేషన్ 89.43 శాతానికి చేరింది.డిజిటైజేషన్ సమయంలో 48, 160 ఫారాలు అన్కలెక్టబుల్గా నమోదవడం చర్చనీయాంశంగా మారింది. ఇందులో అత్యధికంగా 23,803 మంది ఓటర్ల ఆచూకీ లభించలేదు. మరో 11,317 మంది మరణించినవారిగా గుర్తించారు. 10,458 మంది ఇప్పటికే నమోదైనవారు, 2,194 మంది చిరునామాలో లేనివారు, 388 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లినవారిగా గుర్తించారు.

సిర్పూర్లో 24,959 ఫారాలు

సిర్పూర్ నియోజకవర్గంలో 2,28,916 మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేయగా 2,03,957 ఫారాలు డిజిటైజ్ అయ్యాయి. డిజిటైజేషన్ 89.10 శాతానికి చేరింది. 24, 959 ఫారాలు అన్కలెక్టబుల్గా నమోదయ్యా యి. ఇందులో 12,485 మంది ఆచూకీ లేనివారు, 

5,943 మంది మృతులు, 5,600 మంది ఇప్పటికే నమోదైనవారు, 858 మంది చిరునామాలో లేనివారు, 73 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లినవారిగా గుర్తించారు.

ఆసిఫాబాద్లో 23,201 ఫారాలు

ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 2,26, 680 మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేయగా 2,03,479 ఫారాలు డిజిటైజ్ చేశా రు. డిజిటైజేషన్ 89.76 శాతంగా నమోదైంది. మరో 23,201 ఫారాలు అన్కలెక్టబు ల్గా ఉన్నాయి. వీటిలో 11,318 మంది ఆచూకీ లేనివారు, 5,374 మంది మృతు లు, 4,858 మంది ఇప్పటికే నమోదైనవారు, 1,336 మంది చిరునామాలో లేనివా రు, 315 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లినవారిగా గుర్తించారు.

ఆచూకీ లేనివారే అత్యధికం....

జిల్లా వ్యాప్తంగా అన్కలెక్టబుల్గా నమోదైన ఫారాల్లో ఆచూకీ లేని ఓటర్ల సంఖ్యే అత్యధికంగా 23,803గా ఉంది. ఆ తర్వాత 11,317 మంది మరణించినవారు, 10,458 మంది ఇప్పటికే నమోదైనవారు ఉన్నారు. మరో 2,194 మంది చిరునామాలో లేనివారు, 388 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లినవారిగా నమోదయ్యారు.