21 May, 2026 | 4:12 AM

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి

21-05-2026 02:06 AM

వరంగల్, మే 20 (విజయక్రాంతి):.వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ ఆలయాన్ని శ్రీ కంచి పిఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ సందర్శించారు. స్వామీజీకి ఈఓ రామల సునీత, ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషులు పూర్ణకుంభం, మంగళవాద్యాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామివారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ మహామండపంలో భక్తులను ఉద్దేశ్శించి తమ అనుగ్రహ భాషణం చేశారు.

అనంతరం భక్తులకు స్వామివారు ప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో వందలాది భక్తులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ బి. శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, మయూరి రామేశ్వర్రావు, గాండ్ల స్రవంతి, నార్ల సుగుణ, బింగి సతీష్, జారతి వెంకటేశ్వర్లు, పాలడుగుల ఆంజనేయులు, అనంతుల శ్రీనివాస్, తొగరు క్రాంతి, సిరివోలు శ్రీధర్ రావు, మూగా శ్రీనివాసరావు స్వాగతం పలికారు.