2 May, 2026 | 9:24 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

చిన్నారి హత్య ఘటన దోషులను శిక్షించాలి

06-03-2026 01:37 AM
  1. రోడ్డుపై బైఠాయించిన నాయకుల అరెస్ట్

నెలకొన్న ఉద్రిక్త వాతావరణం

ముషీరాబాద్, మార్చి 5(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల పసికందు హత్య ఘటనపై దోషులను కఠినంగా శిక్షించాలని, కేసు విచారణలో నిర్లక్ష్యం వహించిన డిఎస్పీ, సిఐ, ఎస్‌ఐలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ రజక వృత్తిదారుల సం ఘం రాష్ట్ర కార్యదర్శి పి. ఆశయ్య, నగర కార్యదర్శి గోపాల్‌ల ఆధ్వర్యంలో గురువారం లోయర్ ట్యాంక్ బండ్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సంఘం నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘటనపై తక్షణ చర్యలు తీసుకో వాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. నిరసన కార్యక్రమం అనంతరం ఒక్కసారిగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేప ట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

దీంతో పోలీసులకు రజక సంఘం నాయకుల మధ్య తోపులాట చోటుచేసుకోవడంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ఆందోళన చేస్తున్న నాయ కులను బలవంతంగా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.