calender_icon.png 6 February, 2026 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతిపిత ఎవరో ప్రజలకు తెలుసు

06-02-2026 12:46:34 AM

హరీశ్‌రావుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్

 హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి) : బూతుపిత ఎవరో.. జాతిపిత ఎవరో తెలంగాణ ప్రజలకు తెలుసని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని, ఆ తర్వాత అధికార అహంకారంతో కేసీఆర్ మాట్లాడిన భాష బయటకు తీయమంటావా? అని ఆది శ్రీనివాస్ హెచ్చరించారు.

‘మీ మామకు జాతిపిత అని మీకు మీరు బిరుదు ప్రదానం చేస్తే తెలంగాణ ప్రజలు కూడా చప్పట్లు కొట్టాలా..?’ అని ఆయన  నిలదీశారు.  మీ బండారాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక్కొక్కటి బయటపెడతున్నారు. మామ మెప్పు కోసం హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిపైన నోరు పారేసుకుంటున్నా డు’ అని మండిపడ్డారు.