30 August, 2026 | 2:23 AM

ఒరిజినల్ మాన్‌స్టర్ వచ్చేస్తున్నారు!

30-08-2026 12:31 AM

కన్నడ చిత్ర పరిశ్రమలో లెజెండ్‌గా ప్రేక్షకాభిమానం పొందిన శాండల్ వుడ్ కింగ్ శివరాజ్ కుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ఒరిజినల్ మాన్ స్టర్’. ఈ క్రేజీ చిత్రాన్ని డైరెక్టర్ ఆర్ చంద్రూ రూపొందిస్తున్నారు. ఆర్‌సీ స్టూడియోస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై యమున చంద్రూ నిర్మిస్తున్నారు. టాలీవుడ్ నటుడు సునీల్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు.

ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌లో డబ్బు నింపిన బ్యాగుతో బుల్లెట్ బండి మీద వెళ్తూ చేతిలో కత్తితో శివరాజ్‌కుమార్ ఫెరోషియస్ లుక్స్‌లో కనిపించి ఆకట్టుకుంటున్నారు. పలు భారతీయ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి -----సినిమాటోగ్రఫీ: ఏజే శెట్టి; -సంగీతం: బీ అజనీష్ లోక్‌నాథ్; డైలాగ్స్: ఆర్ చంద్రు, మస్తి; ఎడిటర్: గణేశ్; ఆర్ట్: శివకుమార్ జే.