అనుబంధాల నేపథ్యంలో అన్బే డయానా
మిలియన్-డాలర్ స్టూడియోస్, నియో క్యాసిల్ క్రియేషన్స్, ఎరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘అన్బే డయానా’. ఈ సినిమాతో ప్రముఖ నటి రోజా సెల్వమణి వెండితెరపైకి రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె పరి తల్లి సరళ పాత్రలో కనిపించారు. పరి ఎలవళగన్ కథ రాసి, దర్శకత్వం వహించడంతోపాటు హీరోగా నటించారు. రమ్య రంగనాథన్ కథానాయిక.
చెన్నైలోని పెరంబూర్ నేపథ్యంగా తెరకెక్కి న ఈ సినిమా కథ, సంప్రదాయాలకు కట్టుబడి ఉండే ఓ యువకుడి జీవితంలో చోటుచేసుకునే ఊహించని మలుపుతో ఏం జరిగిందనే పాయింట్ చుట్టూ సాగుతుంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఇప్పుడు సోనీ లివ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమ, కామెడీ, మన మూలాలకు, సంస్కృతి, కుటుంబ అనుబంధాల మేళవింపుగా రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు మరింత విస్తృత ప్రేక్షకులకు చేరువ కానుంది.






