20 May, 2026 | 4:52 AM

ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలి

20-05-2026 01:10 AM

డీఆర్‌డీఓ పి.డి. సురేందర్

గాంధారి, మే 19 (విజయక్రాంతి): ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలి అని డి.ఆర్.డి.ఓ. పి.డి. సురేందర్ అన్నారు.. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో డి.ఆర్.డి.ఓ. పి.డి. మండల ప్రత్యేక అధికారి సురేందర్ ఆధ్వర్యంలో సర్పంచ్ , పంచాయతీ కార్యదర్శిలతో మంగళవారం నాడు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని, పనుల వద్ద కూలీలకు కనీస వసతులు ఏర్పాటు చేయాలని అన్నారు.. జూన్ 2 వ తేదీ వరకు ఇందిరమ్మ ఇండ్లు పూర్తయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని, ప్రతీ ఒక్క ఉద్యోగి రెడ్ క్రాస్ సంస్థలో సంవత్సర సభ్యత్వం తీసుకోవాలని ఆయన సూచించారు.. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీఓ లక్ష్మీనారాయణ, ఉపాధి హామీ ఎపిఓ, పలువురు సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు..