బోధన్ సబ్ డివిజన్ గాండ్ల కుల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
12-08-2026 10:09 AM
బోధన్ ఆగస్టు 12(విజయ క్రాంతి): బోధన్ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో బోధన్ సబ్డివిజన్ గాండ్ల కుల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా నాగేశ్వర్రావు, అధ్యక్షుడిగా నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా ప్రసాద్, కోశాధికారిగా సురేష్ ఎన్నికయ్యారు. ఐటీ సెల్ బాధ్యులుగా ప్రవీణ్, సందీప్లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కులస్తుల రాజకీయ, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని నూతన కమిటీ పిలుపునిచ్చింది.






