12 August, 2026 | 10:40 AM

రాజకీయ దుమారం.. వెంకటేష్ మృతిపై బీఆర్ఎస్ ఆందోళన బాట

12-08-2026 10:07 AM

- పరామర్శించనున్న కె టి ఆర్.            

సిరిసిల్ల ఆగస్టు12:(విజయక్రాంతి): సిరిసిల్లలో నేత కార్మికుడు వెంగల వెంకటేశం మృతి ఆత్మహత్య కాదు, హత్య అని పోలీసుల దర్యాప్తులో తేలడంతో ఉద్రిక్తత కు దారితీసింది. యజమాని కుసుమ గణేష్ రసాయనం కలిపిన మద్యం తాగించి ఆయన్ను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు . వెంగల వెంకటేశం (నేత కార్మికుడు)నిందితుడు: కుసుమ గణేష్ (వెంకటేశం పనిచేస్తున్న యజమాని)ఈ నెల 6న రసాయనం కలిపిన మద్యం ఇచ్చి హత్య చేశాడు.

వెంకటేశం సరిగా పనికి రాకపోవడంతో యజమాని గణేష్ హెచ్చరించడం, ఇద్దరి మధ్య గొడవలు జరగడం ఈ ఘటనకీ ప్రధాన కారణం కాగా  మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్‌పై గతంలో ఉన్న ఆరోపణలను అడ్డుపెట్టుకుని, వెంకటేశం హత్యను ఆయనపైకి మళ్లించాలని నిందితుడు గణేష్ ఈ హత్యకు పాల్పడ్డాడని భావిస్తూ బి ఆర్ ఎస్ ఆందోళన బాట పట్టింది. .ఈ ఘటనపై స్థానికంగా రాజకీయ విమర్శలు చెలరేగడంతో పాటు నిందితులను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ పార్టీ అంబేడ్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించింది. బి ఆర్ ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కె. తారకరామారావు బుధవారం మధ్యాహ్నం నేత కార్మికుని కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.