22 August, 2026 | 4:21 AM

నీట్ కోటా జీవో 150ని సవరించాలి

22-08-2026 02:17 AM

నీట్ పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్

తెలంగాణ స్థానిక అభ్యర్థులకు 85 శాతం కోటా కల్పించాలి

1 నుంచి 12వ తరగతి తెలంగాణలో చదివిన విద్యార్థులనే స్థానికులుగా పరిగణించాలి

ముషీరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): తెలంగాణ విద్యార్థులకు దక్కాల్సిన 85 శాతం మెడికల్ స్థానిక కోటా సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు దక్కకుండా జీవో 150ను తక్షణమే సవరించాలని తెలంగాణ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.

జీవో 150 ప్రకారం 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదివిన వారిని స్థానిక అభ్యర్థులుగా పరిగణించే అవకాశం ఉందని, దీంతో ఇతర రాష్ట్రాల విద్యార్థులు నాలుగేళ్లు తెలంగాణలో చదివి 85 శాతం స్థానిక కోటాలో మెడికల్  సీట్లు పొందుతున్నారని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో చిన్ననాటి నుంచి తెలంగాణలో చదువుకుంటున్న విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.

శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు యాతాకుల మధుబాబు, పాపావత్ యాదగిరి, సదనం లక్ష్మయ్య, కేదా రినాథ్, చెర్ల సాయిలు, రమేష్ నాయక్, కృష్ణ, శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్‌లు మాట్లాడుతూ దేశంలో ప్రతియేటా ప్రభు త్వం నీట్ పరీక్షలు నిర్వహిస్తున్నదని అందులో కన్వీనర్ కోటా కింద తెలంగాణకు 6 వేల సీట్లు ఉన్నాయన్నారు. ఈ సీట్లకు గాను 1వ తరగతి నుం చి 12వ తరగతి వరకు తెలంగాణలో చదివిన విద్యార్థులను మాత్రమే స్థానికులుగా పరిగణించి, 85 శాతం మె డికల్ స్థానిక కోటాకు అర్హత కల్పించేలా నిబంధనలు మార్చాలని కోరారు.  ఇప్పటికైనా ప్రభుత్వం ఈ అంశం పై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.