18 April, 2026 | 2:18 AM

సాంకేతిక పరిజ్ఞానం అవసరం

18-04-2026 12:50 AM
  1. పేద విద్యార్థినుల భవిష్యత్తుకు భరోసా
  2. కేటీఆర్ చేతుల మీదుగా ల్యాప్‌టాప్‌ల పంపిణీ

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని, స్వయం సమృద్ధి సాధించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొ న్నారు. పేద విద్యార్థినుల విద్యా సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్న ‘ట ఏ లైఫ్’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బంజారాహిల్స్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాన్ని నిర్వహించారు.

మాజీ కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ సారథ్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు విభూతిజైన్, రీనాహిందోచా విద్యార్థినులతో కలిసి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ముఖాముగా మాట్లాడిన కేటీ ఆర్, వారి విద్యా ప్రగతిని అడిగి తెలుసుకుని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్య క్రమంలో భాగంగా విద్యార్థినుల డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించేందుకు, అకడమిక్ వృద్ధికి మద్దతుగా కేటీఆర్ ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ పంపిణీ చేసిన ల్యాప్‌టాప్‌లను అందుకున్న నామాల రేష్మ, సలికంటి శ్రీవాణి, చింతగుట్ట వేదశ్రీ, ధుళ్ల రాజేశ్వరి, అతికా బారి, సనా సుల్తానా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు విభూతి జైన్, రీనాహిందోచా మాట్లాడుతూ.. తెలంగాణవ్యాప్తంగా బస్తీలు, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థినులను గుర్తించి, వారికి స్కాలర్షిప్‌లు, మెంటార్షిప్, నిరంతర మార్గదర్శకత్వం అందిస్తున్నట్లు తెలిపారు.

కేవలం ఆర్థిక సహాయమే కాకుండా, వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే తమ లక్ష్యమన్నారు.  మాజీ కార్పొ రేటర్ డాక్టర్ సామల హేమను అభినందించారు. ఈ సమావేశం విద్యార్థినులలో ఎంతో ఉత్సాహాన్ని నింపిందని, తమ కలల సాకారానికి ఇది గొప్ప ప్రేరణగా నిలుస్తుందని ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు.