calender_icon.png 13 February, 2026 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో ముగిసిన మున్సిపల్ వార్!

12-02-2026 12:00:00 AM

  1. ఐదు మున్సిపాలిటీల్లో 82 శాతానికి పైగా పోలింగ్ 

13వ తేదీన తేలనున్న అభ్యర్థుల భవితవ్యం 

ఖమ్మం టౌన్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): జిల్లాలో మున్సిపల్ వార్ ముగిసింది. ఐదు మున్సిపాలిటీలకు సంబంధించి బుధవారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా ఆయా మున్సిపాలిటీలోని ఓటింగ్ శాతం దాదాపు 82 శాతంగా నమోదయింది. ఐ యాం మున్సిపాలిటీలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచి బార్లు తీరాలి.

ఆయన మున్సిపాలిటీలో ముఖ్య నాయకులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలు మూశాక ఓటింగ్ యంత్రాలను అధికారులు భద్రంగా స్ట్రాంగ్ రూములకు తరలించారు. ఓట్ల లెక్కింపు 13వ తేదీ జరిపి, అదే రోజు ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రచారంలో హోరాహోరీగా తలపడిన అభ్యర్థులు భవితవ్యం రేపు తేలనుంది. 

కల్లూరులో అత్యధికం.. సత్తుపల్లిలో అత్యల్పం 

ఖమ్మం జిల్లాలో ఏదిలాపురం, వైరా, సత్తుపల్లి, కల్లూరు, మధిర మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. కల్లూరు లో ఓటింగ్ అత్యధికంగా 87.08 శాతంగా నమోదు కాగా, సత్తుపల్లిలో అత్యల్పంగా 77.81 శాతంగా నమోదయింది. ఏదులాపురంలో 85.45 శాతం, వైరాలో 83.71, మధిరలో 78.19 శాతంగా నమోదయింది. మొత్తంగా ఐదు మున్సిపాలిటీల్లో ఓటింగ్ శాతం 82.50గా నమోదయింది. 

ఓటింగ్ లో పాల్గొన్న పురుషుల సంఖ్య 82 శాతంగా నమోదు కాగా మహిళల ఓటింగ్ శాతం, పురుషుల ఓటింగ్ శాతం కంటే కాస్త స్వల్పంగా పెరిగి, 82.96 శాతంగా నమోదయింది. మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు చోటు చేసుకోకపోవడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించటంతో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది.