calender_icon.png 13 February, 2026 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రిలో ప్రశాంతంగా పోలింగ్

12-02-2026 12:00:00 AM

  1. మందకోడిగా ప్రారంభమై గ్రామీణ పుంజుకున్న ఓటింగ్ 

ఓటింగ్ సమయం ముగిసేలోగా 73.33 శాతం ఓటింగ్ నమోదు 

పోలింగ్ కేంద్రాల వద్ద అరకొర వసతులు 

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 11, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం నిర్వహించిన మున్సిపల్ పోల్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మొదట మందకొడిగా సాగింది. క్రమీణ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకునే ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడక్కడ చెదురు మధురు సంఘటనలు మినహా మొత్తం మీద ప్రశాంతంగా పోలింగ్ జరిగింది.

జిల్లాలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఇల్లందు, అశ్వరావుపేట మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహించారు. జిల్లా మొత్తం 16 వార్డుల్లో ఎన్నికలు జరి. 288 పోలింగ్ కేంద్రాల ద్వారా 1,85,348 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. సాయంత్రం ఐదు గంటలకు ఓటింగ్ మూసే సమయానికి.1,35,910మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో 73.33శాతం ఓటింగ్ జరిగింది. 

అశ్వరావుపేట మున్సిపాలిటీలో..

జిల్లాలోని అశ్వరావుపేట మున్సిపాలిటీ పరిధిలోని  22 వార్డుల్లో 35 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 16,850 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవలసి ఉంది. సాయంత్రం 5గంటల వరకు12,839మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో 76.20శాతం ఓటింగ్ నమోదయింది. 

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో..

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీలతోపాటు సుజాతనగర్ లోని ఏడు పంచాయతీల్లో 60 డివిజన్లల్లో, 201 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,34, 775 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. పోలింగ్ పూర్తి ఏ సమయానికి.99,992మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో కొత్తగూడం మున్సిపల్ కార్పొరేషన్ లో74.19శాతం ఓటింగ్ జరిగింది. 

ఇల్లందు మున్సిపాలిటీలో..

ఇల్లందు మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో 52 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 33 723 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. ఓటింగ్ పూర్తయ్య సమయానికి 23,079మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 68.44 శాతం ఓటింగ్ జరిగింది. 

పోలింగ్ కేంద్రాల్లో అరకొర వసతులు..

ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం పదేపదే పోలింగ్ కేంద్రాల వద్ద మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించిన అధికారుల నిర్లక్ష్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద అసౌకర్యాలు నెలకొన్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వృద్ధులు, వికలాంగుల సౌకర్యార్థం రాంపులు ఏర్పాటు చేయాలని, వారిని పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లేందుకు సహాయకులను నియమించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన క్షేత్రస్థాయిలో అధికారులు వాటి ఏర్పాటు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తాగునీరు, ఓటర్లు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేయలేదు. మూడు చక్రాల సైకిల్ లో వృద్ధులను వికలాంగులను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లేందుకు సహాయకులను నియమించలేదు. దీంతో బంధువుల సహకారంతోనే వృద్ధులు వికలాంగులు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకు న్నారు.

పాత పాల్వంచలోని 47 వ పోలింగ్  కేంద్రంలో రాంపుల సౌకర్యం ఏర్పాటు చేయలేదు. వృద్ధులను వికలాంగులను పోలింగ్ కేంద్రంలో తీసుకెళ్లేందుకు సహాయకులబిను సైతం నియమించకపోవడం శోచనీయం. దీంతో బంధువుల సహకారంతోనే వృద్ధులు వికలాంగులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.