9 May, 2026 | 9:45 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

మున్సిపల్ ఓటర్ల జాబితా తప్పుల తడక..

05-01-2026 12:14 AM
  1. కర్ణాటక రాష్ట్ర ఓటర్లను చేర్చారు..సవరించండి..

బీజేపీ యువ నాయకుడు వెంకట్ డిమాండ్

తాండూరు, జనవరి 4, (విజయ క్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ అధికారులు విడుదల చేసిన ఓటర్ల జాబితా ముసాయిదా తప్పుల తడకగా ఉందని వెంటనే సవరించి నూతన జాబితాను తయారు చేయాలంటూ భారతీయ జనతా పార్టీ  జిల్లా కార్యదర్శి జుంటుపల్లి వెంకట్ పురపాలక సంఘం అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 19 వ వార్డులో కర్ణాటక రాష్ట్రం చిత్తాపూర్, సేడం, చించోలి, కలబురిగి ప్రాంతాలకు చెందిన ఓ వర్గం వ్యక్తుల పేర్లను, ఫోటోలు లేకుండా  అక్రమంగా నమోదు  చేయడం సరికాదన్నారు. గతంలో 1650 ఓటర్లు  ఉండగా తాజాగా అధికారులు విడుదల చేసిన జాబితాలో  2250 ఉండడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.   అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల సూచనల మేరకే కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తుల పేర్లు నమోదు చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం  చేశారు. అధికారులు వెంటనే స్పందించి ఓటర్ జాబితాను సవరించాలని ఆయన డిమాండ్ చేశారు.