27 June, 2026 | 1:53 AM

మసీదు ప్రవేశ మార్గాన్ని పునరుద్ధరించాలి

27-06-2026 12:37 AM

పోలీసులకు ముస్లిం సంఘం ఫిర్యాదు

బెజ్జంకి, జూన్ 26: స్థానిక మసీదుకు వెళ్లే ప్రవేశ మార్గాన్ని ఫెన్సింగ్ వైర్తో మూసివేసి కొందరు ఆక్రమించారని, ఆ మార్గాన్ని వెంటనే పునరుద్ధరించి  రాకపోకలు కల్పించాలని కోరుతూ బెజ్జంకి ముస్లిం సంఘం ప్రతినిధులు శుక్రవారం స్థానిక సబ్ ఇన్స్పెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.ఫిర్యాదులో మసీదుకు వెళ్లే ప్రధాన దారిని కొందరు ఫెన్సింగ్ వైర్తో మూసివేయడం వల్ల ప్రార్థనలకు వచ్చే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

దీంతో రోజువారీ ప్రార్థనలతో పాటు మతపరమైన కార్యక్రమాలకు హాజరయ్యే ప్రజలకు రాకపోకల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలిపారు.ఈ విషయంపై వెంటనే విచారణ జరిపి, ఆక్రమణను తొలగించి మసీదుకు వెళ్లే దారిని యథాతథ స్థితికి తీసుకురావడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బెజ్జంకి ముస్లిం సంఘం ప్రతినిధులు పోలీసులను విజ్ఞప్తి చేశారు.