19 March, 2026 | 2:11 PM

రంజాన్ మాసం క్రమశిక్షణకు ప్రతీక

19-03-2026 01:40 AM

జిల్లా ఎస్పీ  రాజేష్ చంద్ర

కామారెడ్డి, మార్చి 18 (విజయక్రాంతి): రంజాన్ మాసము క్రమశిక్షణకు ప్రతిక అని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. బుధవారం రాత్రి కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ముస్లిం సోదరులకు రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హిందూ ముస్లింలు అని తేడా లేకుండా సోదర భావంతో ఐకమత్యంగా ఉండాలన్నారు. క్రమశిక్షణతో పాటు దాతృత్వానికి రంజాన్ పండుగ ప్రత్యేక అని తెలిపారు.

ప్రతి ఒక్కరూ సోదరుభావంతో ఉండాలన్నారు. శాంతి సామరస్యాలతో జీవించాలని సూచించారు. పోలీసు వ్యవస్థలో మతసామరాస్యాన్ని పెంపొందించే దిశగా పండుగలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రార్థనల అనంతరం ఉపవాస దీక్షలను విరమించారు. జిల్లా ప్రజలకు ముస్లిం సోదరులకు పోలీస్ సిబ్బందికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఎస్పీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్పి బీ. చైతన్య రెడ్డి, పట్టణ ఎస్ హెచ్ ఓ నరహరి, ఎస్త్స్రలు, ముస్లిం పెద్దలు,కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.  ఎఎస్పి కామారెడ్డి మరియు పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు మరియు పోలీసులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ముస్లిం సోదరులు మరియు పోలీస్ సిబ్బందికి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వానికి ప్రతీక అని తెలిపారు.

ప్రతి ఒక్కరూ సోదర భావంతో ఐక్యమత్యంగా ఉండి, శాంతి సామరస్యాలతో జీవించాలని సూచించారు. పోలీసు వ్యవస్థలో మత సామరస్యాన్ని పెంపొందించే దిశగా పండుగలను నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రార్థనల అనంతరం ఉపవాస దీక్షలను విరమించారు. కామారెడ్డి జిల్లా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని ఎస్పీ తెలిపారు.

ప్రజలకు పోలీస్ సిబ్బందికి ముందుగానే రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, పట్టణ ఎస్హెచ్‌ఓ నరహరి, ఎస్‌ఐలు, ముస్లిం సోదరులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి ముస్లిం సోదరుల కోసం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు సోదరభావాన్ని ప్రతిబింబించిందన్నారు.