21 May, 2026 | 1:45 AM

అరుదైన సినిమా రమణి కళ్యాణం

21-05-2026 12:27 AM

సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘రమణి కళ్యాణం’. విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్‌పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి. శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మిస్తున్నారు. మే 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్, ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 

ఈ ఈవెంట్‌లో హీరో సూర్య వశిష్ట మాట్లా డుతూ.. “దర్శకుడు విజయ్ తొలి సినిమాకే ఇలాంటి కథను ఎంచుకోవడం మామూలు విషయం కాదు.. చాలా గట్స్ కావాలి. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. చాలా మంచి ప్రయత్నం చేశాం. అందరూ సినిమాను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నా” అన్నారు.

హీరోయిన్ దీప్షిక మాట్లాడుతూ.. “ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమాతో నాకు చాలా ఎమోషనల్ కనెక్షన్ వుంది.  మేమంతా ఎంతో ప్రేమతో ఈ సినిమా చేశాం. ప్రేక్షకులు కూడా ఆ ప్రేమను అందిస్తారని ఆశిస్తున్నా” అని చెప్పారు. దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి మాట్లాడుతూ.. “ఇది చాలా మంచి కథ. సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ప్రేక్షకుల మనసును హత్తుకుంటుంది” అని తెలిపా రు. ఇంకా ఈ వేడుకలో దర్శకుడు రామ్ జగదీశ్, మ్యూజిక్ డైరెక్టర్ సూరజ్, రైటర్ యువరాజ్, నటులు అలీ, శ్రీనివాస్‌రెడ్డి, మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.