21 May, 2026 | 3:01 AM

ఆగస్టులో ఐ యామ్ గేమ్

21-05-2026 12:29 AM

దుల్కర్ సల్మాన్ నుంచి వస్తున్న కొత్త సినిమా ‘ఐ యామ్ గేమ్’ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దుల్కర్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇదే ఏడాది ఆగస్టు 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం డబ్బింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి షహబాస్ రషీద్, ఆదర్శ్ సుకుమారన్ కథా రచన చేశారు. వే ఫారర్ ఫిలమ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళ సినీ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఒకటిగా నిలవనున్న ఈ సినిమాలో దుల్కర్ అల్ట్రా స్టైలిష్, మాస్ అవతార్‌లో కనిపించనున్నారు.

ఇది దుల్కర్ కెరీర్‌లో 40వ చిత్రం కావడం విశేషం. ఇందులో ఆంటోని వర్గీస్, తమిళ నటదర్శకుడు మిస్కిన్, కయాడు లోహర్, కతిర్, పార్థ్ తివారి, తమిళ నటి సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మలయాళంతోపాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుందీ సినిమా. ఈ చిత్రానికి డీవోపీ: జిమ్షీ ఖలీద్; సంగీతం: జేక్స్ బిజోయ్; సాహిత్యం: మను మంజిత్, వినాయక్ శశికుమార్; ఎడిటింగ్: చమన్ చాకో; ప్రొడక్షన్ డిజైన్: అజయన్ చలిసేరి.