26 May, 2026 | 2:45 AM

అభిమానులు గర్వపడేలా మా ఇంటి బంగారం

26-05-2026 12:00 AM

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 19న విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ సోమవారం ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కథానాయకి సమంత మాట్లాడుతూ.. “మా ఇంటి బంగారం’లో అన్ని భావోద్వేగాలు ఉంటాయి.

అభిమానులంతా గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది” అన్నారు. డైరెక్టర్ నందినీరెడ్డి మాట్లాడుతూ.. “కచ్చితంగా ఈ సినిమా బ్లాస్ట్ అవుతుంది” అని చెప్పారు. నిర్మాత రాజ్ నిడిమోరు మాట్లాడుతూ.. “మా ఇంటి బంగారం’ పేరులోనే ఎంతో ఎఫెక్షన్, లవ్ ఉంటుంది. దాని వెనకాల డార్క్ సైడ్, పొసెసివ్ నెస్ కూడా ఉంటుంది” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటీనటులు హిమాంక్ దువ్వూరు, శ్రీముఖి, శ్రీనివాస్ గవిరెడ్డి, చిత్రబృందం కూడా మాట్లాడారు.