సింగిల్ రాజు అలరిస్తాడు
టాలీవుడ్‌లో మరో అందమైన గ్రామీణ ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ చిత్రమే ‘సింగిల్ రాజు’. ఇందులో విశ్వస్, మౌనిక, దివ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను యువ దర్శకుడు ఎస్‌ఎస్ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి గోరటి వెంకన్న, మిట్టపల్లి సురేందర్ పాటలు రాయగా, సాయితేజ కుందారపు, నితీశ్ డీవోపీగా పనిచేశారు.
ఎడిటింగ్ బాధ్యతలను యునిక్ బొజ్జపల్లి నిర్వర్తిస్తుండగా, ప్రొడక్షన్ డిజైన్‌ను రాజ్ మామిడి పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే నటీనటులు, ఇతర విశేషాలను చిత్రబృందం అధికారికంగా ప్రకటించనుంది. అంతకన్నా ముందు సోమవారం ఈ మూవీ టైటిల్, గ్లింప్స్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ దర్శకుడు, నిర్మాత వేణు ఉడుగుల ముఖ్యఅతిథిగా హాజరై మూవీ టైటిల్ పోస్టర్, గ్లింప్స్‌ను ఆవిష్కరించారు.
అనంతరం చిత్ర కథానాయకుడు విశ్వస్ మాట్లాడుతూ.. “మేము ఎంతో ఫ్యాషన్‌తో చేస్తున్న సినిమా ఇది. మా సినిమాను ప్రతిఒక్కరూ ఆదరించాలని కోరుకుంటు న్నాం” అన్నారు. హీరోయిన్లు మౌనిక, దివ్య మాట్లాడుతూ.. ‘మా సినిమా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది. విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే ఈ కథలో అన్ని అంశాలూ ఉంటాయి’ అని చెప్పారు. ‘ప్రేక్షకులను తప్పకుండా అలరించే మంచి ఎంటర్‌టైనర్‌లా ఈ సినిమా నిలుస్తుందనే నమ్మకం ఉంద’ని దర్శకుడు ఎస్‌ఎస్ వర్మ తెలిపారు.






