4 May, 2026 | 1:24 AM

భారత్‌లో పేదల జీవితాలే నయం

04-05-2026 12:17 AM
  1. న్యూయార్క్‌లో మరింత అధ్వానం  
  2. అమెరికన్ కమెడియన్ లూయిస్ సీకే

న్యూయార్క్, మే 3: న్యూయా ర్క్ నగరంలోని పేదల కన్నా భారత్‌లోని పేదలు మెరుగ్గా బతుకుతు న్నారని ప్రముఖ అమెరికన్ కమెడియన్ లూయిస్ సీకే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయుల జీవన విధానంపై ఆయన అమెరికాకు చెందిన ఓ మీడియా సంస్థతో ఈ విషయాలను తాజాగా వెల్లడించారు. ఇటీవల ఆయన ముంబై, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా భారత్‌లో పేదరికాన్ని న్యూయార్క్ నగరంతో ఆయన పోల్చారు.

అమెరికాలోని నిరుపేదల కంటే భారత్‌లోని పేదలే నయమని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూ యార్క్ వీధుల్లో డ్రగ్స్ తీసుకునే వారు, అనాథలు భారీ సంఖ్యలో కనిపిస్తారని చెప్పారు. భారత్‌లో అటువంటి పరిస్థితి తనకు ఎక్కడా కనిపించలేదని పేర్కొన్నారు. ఇండియాలో పేదరికానికి కూడా ఒక పద్ధతి ఉందని ఆయన వివరించారు.

దీనిని ఆయన ‘ఫంక్షనింగ్ పావర్టీ’ అని పిలిచారు. అమెరికాలో కనీస జీవన ప్రమాణం కంటే దిగువకు పడిపోతే బతకడం అసాధ్యమని లూయిస్ ఆవేదన వ్యక్తం చేశారు. పాశ్చాత్య దేశాల పేదల కంటే భారత్‌లో పేదలు గౌరవంగా జీవిస్తున్నారని కొనియాడారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.