1 July, 2026 | 6:33 PM

Breaking News

ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •   రైతు భరోసా చారిత్రక ఘట్టం.. రైతుల కోసం లక్ష కోట్ల వ్యయం: ఎమ్మెల్యే రాగమయి   •  

సిద్దాపూర్ రిజర్వాయర్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

01-07-2026 12:00 AM

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ, జూన్ 30 (విజయక్రాంతి): సిద్దాపూర్ రిజర్వాయర్ భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించారు.హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లోని కార్యాలయంలో మంగళవారం సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులపై ఇరిగేషన్ అధికారులు ఈఎన్సీ జనరల్ రమేష్, అడ్మిన్ శ్రీనివాస్ లతో పోచారం శ్రీనివాస్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. 

సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణం వేగవంతం చేయడంలో భాగంగా గత నెల 23 మే 2026న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముంపు ప్రభావిత భూములకు నష్టపరిహారం చెల్లించి అవసరమైన అనుమతులు పొందేందుకు రూ. 55.30 కోట్లను మంజూరు చేస్తూ జి.ఓ. నం. 37 ద్వారా 08 జూన్ 2026న ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు.ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగేందుకు సంబంధిత ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రతి దశను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.