30 June, 2026 | 3:58 AM

అక్రెడిటేషన్ల జారీలో అన్యాయాన్ని సరిదిద్దాలి

30-06-2026 12:50 AM

ఐ అండ్ పీఆర్ ఎదుట డెస్క్ జర్నలిస్టుల ధర్నా

ముషీరాబాద్, జూన్ 29(విజయక్రాంతి): డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ల జారీలో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని డెస్క్ జర్నలిస్టుల సంఘం(డీజేఎస్) డిమాం డ్ చేసింది.10,12 ఏండ్లకుపైగా సీనియారిటీ ఉన్న వారికి కూడా కార్డులు రావడం లేదని, అసంబద్ధమైన కారణాలను చూపుతూ అక్రెడిటేషన్లు నిరాకరించడం సరికాదని విమ ర్శించింది. ఈ మేరకు డీజేఎస్ ఆధ్వర్యంలో డెస్క్ జర్నలిస్టులు సోమవారం ఐఅండ్ పీఆ ర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా డీజేఎస్ అధ్యక్షుడు బాదిని ఉపేందర్ మాట్లాడుతూ పాత కార్డులపై కొనసాగుతన్న బస్‌పాస్‌ల గడువు ఈ నెల 30తో ముగుస్తున్నందున తక్షణమే కొత్త అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చే యాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో దివ్యాంగులైన వర్కింగ్ జర్నలిస్టులు అతి తక్కువ సంఖ్యలో ఉన్నారని, మేనేజ్‌మెంట్ల కోటాతో సంబంధం లేకుం డా వారందరికి కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశా రు. జిల్లాల్లో అప్లికేషన్లను వెంటనే అప్రూవ్ చేసి తక్షణం కార్డులు అందజేయాలన్నారు.

సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో హామీ ఇచ్చినట్టుగా ఎక్కువ జనాభా కలిగిన మండలాల్లో మం డల స్థాయి విలేకరులకు ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఇవ్వాలన్నారు. అనంతరం ఐ అండ్ పీఆర్ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో డిమాండ్లతో కూడిన మెమొరాండం ను ఐ అండ్ పీఆర్ అడిషనల్ డైరెక్టర్ జగన్‌కు సమర్పించారు.దీనిపై ఆయన స్పంది స్తూ మెమొరాండంలో పేర్కొన్న సమస్యలను కమిషనర్, మీడియా అకాడమీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

ఈ కార్యక్ర మంలో డీజేఎస్ ప్రధాన కార్యదర్శి కేఎన్ రా జారామ్, ట్రెజరర్ వి. వెంకటరమణ, జా యింట్ సెక్రటరీ కనపర్తి రమేశ్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి. పద్మ, సంఘం ప్రతినిధులు సిలివేరు వెంకటేశం, చల్లా సైదిరెడ్డి, రమేశ్, అశోక్, రమేశ్, తిరుపతి పాల్గొన్నారు.