31 March, 2026 | 4:51 AM

పేదవారి ఆత్మ గౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇల్లు

31-03-2026 01:13 AM

బూర్గంపాడు, మార్చి 30 (విజయక్రాంతి): పేదవారి ఆత్మ గౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇల్లు అని బూర్గంపాడు మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి అన్నారు. సోమవారం బూర్గంపాడు మండలం కృష్ణ సాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని బత్తులనగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారు సోందే కోటమ్మ గృహ ప్రవేశం సందర్భంగా ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.ప్రజా ప్రభుత్వంలో ప్రజా సంక్షేమం ధ్యేయంగా ముందుకు పోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తాటి వాణీ,ఉప సర్పంచ్ భూక్య మోహన్ రావు, పంచాయతీ సెక్రటరీ నాగిరెడ్డి,మాజీ సర్పంచ్ కోడెం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.