ఈ వారం వార్తల్లో..
ప్రశ్నిస్తే.. పదవి పాయే!
ఎంపీ రాఘవ్ చడ్డా యువ రాజకీయ నేత. చార్టర్డ్ అకౌంటెంట్ చేశారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించారు. ఆమ్ ఆద్మీ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించారు. 2020లో ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత పంజాబ్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో తను లేవనెత్తిన ప్రశ్నలతో గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయనను పార్టీ రాజ్యసభలో ఆప్ ఉపనేత పదవి నుంచి తప్పించింది.
సీటు దక్కని అన్నామలై!
కర్ణాటక కేడర్ ఐపీఎస్ మాజీ అధికారి కె.అన్నామలై, ‘సింగం’గా పేరు తెచ్చుకుని, పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి, బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగిన ప్రయాణం ఆసక్తికరంగా ఉంటుంది. 2020లో బీజేపీలో చేరిన ఆయన, అతి తక్కువ కాలంలోనే కీలక నేతగా ఎదిగి, రాష్ట్ర రాజకీయాల్లో పార్టీని చురుకుగా నడిపిస్తున్నారు. అయినా ఆయనకు ఈ సారి కేరళం ఎన్నికల్లో బీజేపీ సీటు దక్కలేదు.




