12 April, 2026 | 3:04 AM

జీసీసీల కేరాఫ్ హైదరాబాద్

12-04-2026 01:10 AM

హైదరాబాద్.. 

ప్రముఖ కంపెనీలను ఆకర్షిస్తున్న అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు

పికో టెక్నాలజీ సంస్థ ప్రతినిధుల భేటీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.. మంత్రి కోమటిరెడ్డి హాజరు

హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి) : ప్రపంచంలోని దిగ్గజ ఫైనాన్స్ సంస్థలన్నీ తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాల (జీసీ సీ) ఏర్పాటుకు హైదరాబాద్ నగరాన్ని గమ్యస్థానంగా ఎంచుకున్నాయని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. నైపుణ్యాలతో కూడిన టాలెంట్ పూల్, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ సమస్యలేని రోడ్లు, అందుబాటులో ఉండే అద్దెలు ప్రముఖ కంపెనీలను ఆకర్షిస్తున్నాయని ఆయన తెలిపారు.

న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే పికో టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు శనివారం సచివాలయంలో శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఫైనాన్సియల్ మార్కెట్‌కు సంబంధించిన సేవలు అందించే పికో టెక్నోలజీ సంస్థ పికో టెక్నాలజీ ఇండి యా అనే అనుబంధ కంపెనీ ద్వారా ఇక్కడ జీసీసీని ఏర్పాటుచేయడానికి ముందుకొచ్చింది.

ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు వారికి ఇక్కడి అవకాశాలు, మౌలిక వసతుల గురించి వివరించారు. రాను న్న 5--10 సంవత్సరాలు, తర్వాత 20 సంవత్సరాల అవసరాలకు తగిన విధంగా మౌలిక సదుపాయాలు మెరుగు పర్చేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

బెంగళూరు, ముంబై నగరాలతో పోలిస్తే ఇక్కడ ఆఫీసు స్థలాల ఆక్యుపెన్సీ 73 శాతం ఉందని చెప్పారు. ముంబాయిలో అది 52 శాతం మాత్రమేనని తెలిపారు. బెంగళూరు, ముంబాయి మెట్రో నగరాల్లో ట్రాఫిక్, వాయు కాలుష్యం ప్రధాన సమస్యలుగా మారినందున ఐటీ సంస్థలు, జీసీసీలు హైదరాబాద్‌కు తరలి వస్తున్నాయని తెలిపారు. 

రహదారులకు నిధులు: మంత్రి కోమటిరెడ్డి 

ఇప్పుడున్న నెహ్రూ రింగ్ రోడ్డుకు 30 కిలో వెలుపల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నట్టు ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. దానికి అనుబంధంగా రేడియల్ రోడ్లు ఏర్పాటవుతు న్నాయి ని వివరించారు. రింగ్ రోడ్ల పక్కన రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేసి రవాణా సదుపాయాలను ప్రపంచంలోని పెద్ద నగరాలను తలదన్నేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. హయత్‌నగర్,- ఎల్బీనగర్‌ల మధ్య డబుల్ డెక్కర్ రోడ్డు నిర్మిస్తున్నట్టు వివరించారు.

కింది రోడ్డు స్థానిక ట్రాఫిక్ అవసరాలకు వినియోగిస్తామని, పైన ఉండే రెండు అంతస్థుల రోడ్లు నగరం నుంచి వెలుపలకు, లోపలకి వచ్చే వాహనాల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. నాగపూర్ తర్వాత డబుల్ డెక్కర్ రోడ్లు నిర్మి స్తున్న నగరం ఇదేనని అన్నారు. రెండు నెల ల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రా రంభిస్తామని చెప్పారు. సమావేశంలో పికో టెక్నాలజీ వ్యవస్థాపక సీఈవో జారొడ్ యు స్టర్, పికో ఇండియా సీఈవో హరికోదండరామన్, డైరెక్టర్ సీతారాం పాల్గొన్నారు.