23 June, 2026 | 10:20 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ కీలకం

20-06-2026 12:00 AM

మండల వైద్యాధికారి డాక్టర్ జువేరియా బేగం

నాగలిగిద్ద, జూన్ 19: బాలికల ఆరోగ్య పరిరక్షణతో పాటు భవిష్యత్తులో ప్రాణాంతక వ్యాధుల నివారణకు హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ అత్యంత కీలకమని మండల వైద్యాధికారి డాక్టర్ జివేరియా బేగం పేర్కొన్నారు. నాగలిగిద్ద మండల పరిధిలోని కరస్ గుత్తి గిరిజన గురుకుల పాఠశాలలో శుక్రవారం హెచ్పీవీ వ్యాక్స్పి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

డాక్టర్ జివేరియా బేగం, ఆసుపత్రి సూపర్వైజర్ విక్టోరియా రాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులకు హెచ్పీవీ వైరస్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు దారితీసే కారణాలు, వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.