17 March, 2026 | 5:09 AM

గవర్నర్ ప్రసంగం డొల్ల

17-03-2026 02:21 AM
  1. చిత్తు కాగితంతో సమానం
  2. అందులో స్కీముల కంటే స్కాములే ఎక్కువ
  3.   6 గ్యారెంటీలు గాలికి, అటకెక్కిన 420 హామీలు
  4. మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి) : గవర్నర్ ప్రసంగం పూర్తిగా డొల్లగా, అబద్ధాలతో నిండిపోయిందని, ప్రజలకు ఉప యోగపడే స్కీముల కంటే స్కాములే ఎక్కువగా ఉన్నాయని మాజీ మంత్రి వేముల ప్ర శాంత్‌రెడ్డి విమర్శించారు. ఇది ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నమేనని మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ గొప్పగా ప్రకటించిన 6 గ్యారెంటీలు, 420 హామీలు గవర్నర్ ప్ర సంగంలో ఎక్కడా కనిపించకపోవడం ప్రజలను మోసం చేసినట్టేనని విమర్శించారు.

ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సహా యం ఇస్తామని రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభు త్వం మోసం చేస్తూనే ఉందని, ఆ అంశాన్ని గవర్నర్ ప్రసంగంలో కూడా ప్రస్తావించకపోవడం దురదృష్టకరమన్నారు. పెన్షన్ వృద్ధు లు, వితంతువులు, బీడీ కార్మికులకు రూ. 4,000, దివ్యాంగులకు రూ.6,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయారని విమర్శించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ పూర్తిగా చేశామని చెప్పించడం అబద్ధమని పేర్కొన్నారు.

రాష్ట్రం లో సగం మంది రైతులకు కూడా రుణమాఫీ పూర్తి కాలేదని, అయినప్పటికీ అందరి కీ చేశామని ప్రచారంచేయడం మోసమేనని అన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 12 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. కానీ గవర్నర్ ప్రసంగంలో 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని చె ప్పించడం వాస్తవాలకు విరుద్ధమని మండిపడ్డారు.

ఇవి కూడా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ల ఫలితమేనని, కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కాదని స్పష్టంచేశారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలపై కూడా ప్రభు త్వం స్పష్టత ఇవ్వలేదని, జాబ్ క్యాలెండర్ ఇప్పటికీ ప్రకటించలేదని విమర్శించారు. ప్ర జలకు ఇచ్చిన హామీల అమలు జరిగే వరకు బీఆర్‌ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ పోరాటం కొనసాగిస్తుం దని స్పష్టంచేశారు.

ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించిందని, ఆరు గ్యారెంటీల గురించి ప్రసంగంలోనే లేదన్నారు. తగిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. గుడిలాంటి అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారని, అందుకు గవర్నర్ దేవాల యాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పేర్కొన్నారు.