10 July, 2026 | 9:25 PM

గంజాయి, బెల్ట్ షాప్ ల నిర్మూలనకు మున్సిపల్ అధికారులు కృషి చేయాలి

10-07-2026 08:11 PM

సిపిఐ కౌన్సిలర్ బబ్బూరి శ్రీధర్ డిమాండ్

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట మున్సిపల్ సమావేశం శుక్రవారం  నిర్వహించగా ఈ సమావేశంలో సిపిఐ పార్టీ 12వ వార్డ్ కౌన్సిలర్ బబ్బూరి శ్రీధర్, కో ఆప్షన్ సభ్యురాలు బండి జంగమ్మ లు మూడు అంశాలను లేవనెత్తడం జరిగింది.  యాదగిరిగుట్టలో గంజాయి నిర్మూలన, బెల్ట్ షాపులను తొలగించడం, నిర్ణయించిన స్థలం కంటే రోడ్డును ఆక్రమించిన వాటిని తొలగించుట  మూడు అంశాలపై  కౌన్సిల్ సమావేశంలో నినదించడం జరిగింది. పట్టణంలో రోజు రోజుకి యువత గంజాయి కి వ్యసనాలకు బానిస అవుతున్నారని, బెల్ట్ షాపులు విపరీతంగా పెరుగుతున్నాయని వీటి వలన చుట్టుపక్కల ప్రజలు,పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

గంజాయి, బెల్ట్ షాపుల నిర్మూలన కోసం మున్సిపల్ అధికారులు, చైర్మన్, పోలీస్, ఎక్సైజ్ శాఖతో సమన్వయంతో కృషిచేసి పట్టణంలో గంజాయి,బెల్ట్ షాపు నిర్మూల కృషి చేయాలని డిమాండ్ చేశారు. పట్టణంలో మెయిన్ రోడ్డు పైన దుకాణదారులు తమ కేటాయించిన షాపు హద్దులు కాకుండా పూర్తిగా బిటి రోడ్డుపై వరకు దుకాణలు ఏర్పాటు చేస్తున్నారని, బిటి రోడ్డు వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని, దీనివల్ల గుట్ట కి వచ్చే భక్తులకు స్థానిక ప్రజల రవాణాకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు. భక్తులు వాహనాలను ఆపి ఏదైనా కొనుగోలు చేసేందుకు కూడా స్థలం లేకుండా పోయిందని పూర్తిగా రోడ్డుపైనే నిలపాల్సి వస్తుందని తక్షణమే కమిషనర్ స్పందించి వీటన్నిటికీ హద్దులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వీటిపై స్పందించకుంటే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని అన్నారు.