5 May, 2026 | 4:18 AM

రైతుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

05-05-2026 01:49 AM

ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల, మే 4: రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా నకిరేకల్ పట్టణంలోని రైతు వేదికలో నిర్వహించిన రైతు వార్షికోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న రైతు సంక్షేమ పథకాల అమలు తీరును రైతులకు వివరించారు. ప్రతి ఎకరాకు సాగునీరు, సకాలంలో ఎరువులు, మద్దతు ధర కల్పించే బాధ్యత మా ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.