హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం
- ప్రజా పాలన అంటూ ప్రజలను మోసం చేస్తున్నారు
- చెప్పిందొకటి చేసేదొకటి పథకాల జాడే లేదు
- ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి
జడ్చర్ల, మార్చి 23 : ఇచ్చిన హామీలను మార్చి ప్రజలను తీవ్ర ఇబ్బందుల గురి చేస్తూ ప్రజా పాలన అంటూ మాయ మాటలు చెబుతూ కాలం వెల్లదిస్తుందని మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ కళాభవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీమంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపట్టిన బడ్జెట్ చూస్తే పండుగ వాతావరణంలో ప్రజ ల నెత్తిన కుండ వేసినట్లు అయిందని మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి విమర్శించారు.
మూడోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన ప్రభుత్వం మూడో బడ్జెట్ లో ప్రజలకు ఇచ్చిన హామీ లు అమలు చేస్తారని ఆశలు పెట్టుకున్నాని,ఆ ఆశలు నిరాశయిందన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేస్తారని ప్రజలు అనుకున్నారని, విడ్డూరంగా బడ్జెట్ ప్రవేశపెట్టారని తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పండుగ తర్వాత గుండు సున్నా, సున్నా బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ధ్వజమెత్తారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మూడున్నర లక్షల కోట్ల అప్పు చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. తొండి మాటలు మాట్లాడారని గత ప్రభుత్వ బిఆర్‌ఎస్ హయాంలో రూ 8 వేల లక్షల కోట్ల అప్పు చేసిందని వాటికి సంబంధించిన అప్పు చెల్లిస్తున్నామని అసెంబ్లీలో మాట్లాడడం సరికాదన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ 2 లక్షల 80 వేల కోట్లు మాత్రమే అప్పు చేసిందని పార్లమెంట్ సాక్షిగా వెల్లడించారని పేర్కొన్నారు.
పార్లమెంట్ సాక్షిగా చెప్పిన మాటలను తప్పుదోవ పట్టించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు మూడున్నర లక్షల కోట్లు అభివృద్ధి చేయకుండా ఎక్కడ పోయాయని ప్రజలు చర్చించుకుంటున్నారని పేర్కొ న్నారు. అందరూ చర్చించుకుంటున్నారని కాంగ్రెస్ అంటేనే స్కామ్ అని అందరికీ తెలు సు అని డబ్బులన్నీ ఢిల్లీకి పోతున్నాయని ప్రజలకు తెలుసన్నారు. మాది ప్రజా పాలన రైతు పాలన అంటూ కాంగ్రెస్ నాయకులు గప్పాలు కొడతారు తప్ప రైతులకు ప్రజా పాలనలో చేసింది శూన్యమన్నారు.
రైతుబం ధు సంవత్సరానికి 15000/- వేలు ఇస్తామని హామీ ఇచ్చారని పట్టాదారుతో పాటు కౌలుదారు కూడా పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ దిక్కులేదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలో ఫ్రీ బస్ తప్ప వేరేది ఏది లేదని తులం బంగారం లేదు, 2500/లేదు స్కూటీ లేదు, 4000 ముసలి వాళ్లకు ఇస్తామన్నారని మహిళకు ఇస్తామని అన్నారని కానీ ఏదీ అమలు కాలేదని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన పేర్కొన్నారు.
ప్రజలు ఆలోచించాలని రెండున్నర సంవత్సరాల కాలంలో మూడున్నర లక్షల కోట్ల అప్పు అంటే ఏంటని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ చేయడానికి చేతకావడం లేదని ప్రభుత్వానికి ఆదాయం ఎలా సమకూర్చాలో ఈ పాలకులకు తెల్వదన్నారు.
అడ్మినిస్ట్రేషన్ చేతకాక ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తెలియక ఎక్కడ అర్థం కాక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ జేడ్పీ వైస్ చైర్మన్ కోడుగల్ గల్ యాద య్య.నాగిరెడ్డి, హఫీజ్ ఉర్ రెహమాన్, ఇంతియాజ్ కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి, బుక్క మహేష్,లత, నరసింహ యాదవ్, శ్రీనివాస్ యాదవ్,ముఖీద్,ఇప్తేకార్, పెద్ది వేంకటేశ్,సంజివ్ రెడ్డి,ప్రదిప్, తదితరులు పాల్గొన్నారు.




