26 August, 2026 | 9:25 PM

నాగిరెడ్డిపేట్లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు

26-08-2026 08:11 PM

ప్రధాన విధుల్లో ముస్లిం సోదరుల ర్యాలీ

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): నాగిరెడ్డిపేట్ మండలంలో పవిత్ర మిలాద్ ఉన్ నబీ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ముస్లిం సోదరులు పెద్దసంఖ్యలో పాల్గొని గోపాల్పేట్ గ్రామంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈర్యాలీతో గోపాల్పేట్లో పండుగ వాతావరణం నెలకొంది.ర్యాలీలో చిన్నారులు, యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రవక్త మహమ్మద్‌ బోధించిన శాంతి, సోదరభావం, ప్రేమ, మానవత్వం, పరస్పర గౌరవం వంటి విలువలను ప్రజలకు చాటుతూ ర్యాలీ కొనసాగింది. నాగిరెడ్డిపేట, గోపాల్పేట గ్రామాల్లో ప్రధాన కూడళ్లు, వీధుల గుండా ర్యాలీ కొనసాగడంతో నాగిరెడ్డిపేట్ మండల ఎస్ఐ భార్గవ్ గౌడ్ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసు సిబ్బంది తగు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం ముస్లిం సోదరులు,యువకులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.