పేద విద్యార్థుల అభ్యున్నతే ధ్యేయం
జవహర్‌నగర్ మాజీ డిప్యూటీ మేయర్ శ్రీనివాస్
జవహర్ నగర్, ఫిబ్రవరి 25 (విజయ క్రాంతి): ప్రభుత్వ విద్యాలయాలు విద్యార్థుల అభివృద్ధికి హేతువులని పేద విద్యార్థుల అభ్యున్నతే ధ్యేయమని జవహర్ నగర్ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ తెలిపారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ సందర్శించి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పరీక్ష గణితులను అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడు తూ విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. అనంతరం పాఠశాలలోని 150 మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆణిముత్యాల పేరిట పదివేల రూపాయలు నగదు బహుమతిని అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి శెట్టి మహేష్ గుప్తా, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, కోట శ్రీనాథ్ గుప్తా, గడ్డమీద విజయ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఖాజా మొయినుద్దీన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




